తెలంగాణలో మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు

  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 59,709 పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 424 కేసులు
  • రాష్ట్రంలో 21 మంది మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 59,709 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,043 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,56,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,13,968 మంది కరోనాను జయించారు. ఇంకా 39,206 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,146కి పెరిగింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరికాస్త పెరిగి 92.38 శాతంగా నమోదైంది.

Telangana
Corona Virus
Daily Cases
Deaths
New Cases
Recovery Rate

More Telugu News